ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో ‘గాడ్సే’ సినిమాలో నటిస్తూ త్రిషతో డ్యూయట్స్ పాడుతున్న బాలయ్య వెంకటేష్ నాగార్జునలను అనుసరిస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవైపు తన 100వ సినిమా గురించి ఆలోచన చేస్తున్న బాలకృష్ణ ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా తరువాత ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పై తనకు సన్నిహితులైన దర్శక నిర్మాతల సలహాలు తీసుకుంటున్నట్లు టాక్. ఇప్పటి వరకు నాగార్జున, వెంకటేష్ లు మల్టీ స్టారర్ సినిమాలు చేసి విజయాలు అందుకున్నా ఈ విషయంలో మాత్రం బాలకృష్ణ వెనకపడి ఉన్నాడు అన్న సంగతి వాస్తవం. గతంలో ‘ఊకొడతారా ఉలిక్కి పడతారా’ సినిమాలో బాలకృష్ణ మంచు మనోజ్ తో కలిసి నటించినా అది పెద్దగా కలిసి రాలేదు.  ఇప్పుడు తెలుగులో మల్టీ స్టారర్ల హవా నడుస్తూ ఉండటంతో ఈ ట్రెండ్ కు తగ్గట్లుగా ఏమైనా మంచి కధ ఉందా అని బాలకృష్ణ తనకు సన్నిహితులైన దర్శకుల వద్ద ఈ ప్రస్తావన తీసుకు వస్తున్నట్లు టాక్. ఇప్పటి వరకు సోల్ హీరోగా తన ప్రాభవాన్ని చూపెట్టిన బాలయ్య ఆలోచనలలో మల్టీ స్టారర్ ప్రస్తావన రావడం బాలయ్య సన్నిహితులను ఆశ్చర్య పరుస్తోంది అని అంటున్నారు.  ఈ వార్తలే నిజం అయితే బాలయ్య నటించబోయే ఈ మల్టీ స్టారర్ టాలీవుడ్ లో ఒక సంచలనమే అవుతుంది. మరి బాలయ్య తాను కలిసి నటించడానికి ఏ హీరోని ఎంచుకుంటాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: