సాధారణంగా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డేటింగ్ వ్యవహారం అనేది చాలా కామన్. అయితే వారి డేటింగ్ కి అంటూ ఓ లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ లిమిట్స్ ని ఓ హీరోయిన్ క్రాస్ చేసింది. ప్రస్తుతం ఇది బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా కిక్ సినిమా వ్యవహారంలో జరుగుతుంది. సల్మాన్ ఖాన్ నటించిన కిక్ మూవీలో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాంజెడ్ నటించింది. ఈ మూవీ షూటింగ్ స్టార్టింగ్ నుండి వీరిద్దరి వ్యవహారం చిత్ర యూనిట్ లోనూ అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. తాజాగా వీరిద్దరూ దాదాపు 13 రోజుల పాటు డేటింగ్ చేశారని, దానికి సంబంధించిన డిటైల్స్ ని సైతం బిటౌన్ మీడియా బయట పెట్టింది. రీసెంట్ గా జరిగిన కిక్ మూవీ పబ్లిసిటి ప్రమోషన్ లోనూ జాక్వెలిన్, సల్మాన్ ఖాన్ ని విపరీతంగా పొగడటం, అంతే కాకుండా తనతో ఉన్న సాన్నిహిత్యాన్ని అందరికి ఓపెన్ గా చెప్పడం వంటి విషయాలు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉందనటానికి ఛాన్స్ ఏర్పడుతుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన 'కిక్' సినిమా ప్రచారంలో హీరో సల్మాన్ ఖాన్ ఎక్కువగా ప్రమోట్ చేయడాన్ని హీరోయిన్ జాక్వెలెన్ ఫెర్నాంజెడ్ సమర్థించింది. సల్మాన్ ఖాన్ నిజమైన హీరో, తనని ప్రమోట్ చేయటంలో తప్పేముందని అంటూ ఎదురు ప్రశ్నించింది. అంతే కాకుండా సల్మాన్ ని చాలా దగ్గరగా చూసాను. తన వ్యక్తిత్వం తనకు నచ్చింది. తనకు పెళ్ళికొడుకుగా చూడాలని ఉంది అంటూ కామెంట్ చేసింది కూడ. జాక్వెలిన్, సల్మాన్ ఖాన్ ఇద్దరూ ఓ పదమూడు రోజుల పాటు చాలా క్లోజ్ రిలేషన్ ని మెయింటెన్ చేశారని బిటౌన్ అంటుంది. కిక్ షూటింగ్ సందర్భంగా వీరిద్దరూ వెళ్ళిన ఫారెన్ షెడ్యూల్ లో ఇది జరిగిందని బిటౌన్ టాక్. శ్రీలంకకు చెందిన జాక్వెలెన్ 2009లో అల్లాదీన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. 'కిక్' సినిమాకు సాజిద్ నడియాడ్‌వాలా దర్శకత్వం వహించగా, చేతన్ భగత్ స్క్రీన్ ప్లే అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: