మహేష్ కుమారుడు గౌతమ్ కృష్ణకు క్రితం పుట్టినరోజుకు ఒక కోటి పైన విలువగల ‘టయోటా క్రూజర్’ కారును బహుమతిగా టాలీవుడ్ ప్రిన్స్ ఇస్తే ఈసారి ఏకంగా మహేష్ తన ‘ఆగడు’ ఆడియో ఫంక్షన్ ను గౌతమ్ పుట్టినరోజునాడే ఏర్పాటుచేసి తన కొడుకుకు మరో అరుదైన గిఫ్ట్ ను ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ మహేష్ పుట్టినరోజు ఆగస్టు 9న విడుదల అవుతూ ఉంటే అదే నెలలో వచ్చే ఆగష్టు 31న గౌతమ్ పుట్టినరోజు నాడు ‘ఆగడు’ ఆడియో విడుదల అవుతూ ఉండటం మహేష్ బాబు అభిమానులకు ఒక నెలలో వచ్చే రెండు పండుగలు అని అనుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 50వ చిత్రoగా ‘ఆగడు’ అయింది కాబట్టి ఈ సినిమా పాటలు తమన్ ఆదరగోట్టాడని ఈ సినిమా యూనిట్ నుండి వస్తున్న టాక్. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న శ్రుతిహాసన్ బికినీలో కనిపించబోతోంది అనే ప్రచారం ఫిలింనగర్ లో జరుగుతోంది. సుమారు నాలుగు నిముషాలు ఉండే ఈ స్పెషల్ సాంగ్ ‘ఆగడు’ సినిమాకు హైలెట్ అని అంటున్నారు.  ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న ‘ఆగడు’ మహేష్ బాబు కలెక్షన్స్ స్టామినాను ఏరెంజ్ లో చేరుకుంటుందో చూడాలి. త్వరలో నార్వే వెళ్లి మహేష్, తమన్నా తో రెండు రొమాంటిక్ సాంగ్స్ లో తమన్నాతో రొమాన్స్ చేయబోతున్నాడని ఈ ఫిలిం యూనిట్ ద్వారా అందుతున్న సమాచారం. ‘ఆగడు’ గౌతమ్ సెంటిమెంట్ ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: