సామాన్యులలాగే సెలెబ్రెటీలకు కూడ కొన్ని అలవాట్లు ఉంటాయి. చాలామంది ఏదైనా ఒక విషయం శ్రద్దగా వింటున్నప్పుడు తమ గోళ్ళను కొరుక్కునే అలవాటు ఉంటుంది. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు కూడ గోళ్ళు కొరుక్కునే అలవాటు ఉంది అని చెపుతూ కొంతమంది జూనియర్ ‘రభస’ షూటింగ్ లో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఒక సీన్ గురించి సీరియస్ గా చెపుతూ ఉంటే తన గోళ్ళను కొరుక్కుంటూ ఆ సీన్ ను వింటున్న జూనియర్ ఫోటోలను వెబ్ మీడియాలో పెట్టి హడావిడి చేస్తున్నారు.  జూనియర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఆడియో వేడుక ఈనెల 27న జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ ఆడియో వేడుకలో కొన్ని సంచలనాలు ఉంటాయి అన్న ప్రచారం అప్పుడే మొదలు అయిపోయింది.  ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హీరో నాగార్జున అతిధులుగా రాబోతున్నారని ఫిలింనగర్ లో గాసిప్స్ హడావిడి అప్పుడే మొదలైపోయింది. ఈ వార్తలే నిజం అయితే ‘రభస’ ఆడియో విడుదల టాలీవుడ్ లో ఒక సంచలనమే అవుతుంది. జూనియర్ పాడిన ‘రాకాసి రాకాసి’ పాట కోసం యంగ్ టైగర్ అభిమానులు ఈ ఆడియో ఎప్పుడు విడుదల అవుతుందా అని రోజులు లెక్కపెడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: