యోగా బ్యూటీ అనుష్క అనాలోచితంగా అన్న మాటలు ఆమెకు ఇప్పుడు శాపంగా మారి కోలీవుడ్ హీరోల అభిమానులచేత వెబ్ మీడియాలో టార్గెట్ చేయబడటం ఇప్పుడు కోలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య త్రిష ఒక తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిమాన హీరో అజిత్ అంటూ నోరు జారినందుకు ఆమెను హీరో విజయ్ అభిమానులు తీవ్రంగా టార్గెట్ చేయడమే కాకుండా ఆమె పై అసభ్య పదజాలలతో విరుచుకు పడ్డారు. ఆ హడావిడి ఇంకా చల్లారకుండానే ఇప్పుడు అనుష్క చేసిన కామెంట్ ఆమె మెడకు చుట్టుకుంది. కోలీవుడ్ కే చెందిన మరొక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనుష్కను మీకు నచ్చిన హీరో ఎవరు అన్న ప్రశ్నకు అనుష్క తెలివిగా కోలీవుడ్, టాలీవుడ్ హీరోల పేర్లు చెప్పకుండా తనకు అభిషేక్ బచ్చన్, షారూఖ్‌ఖాన్, హృతిక్ రోషన్ అభిమాన నటులు అంటూ చెప్పడం తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో కలకలం రేకెత్తించింది. అంతేకాదు అనుష్క ప్రస్తుతం తాను నటిస్తున్న విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ వంటి కోలీవుడ్ టాప్ హీరోలు అలాగే తెలుగులో నాగార్జున, వెంకటేష్, మహేష్‌బాబు, ప్రభాష్ వంటి స్టార్ హీరోల పేర్లు చెప్పకుండా తాను ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ నటించని బాలీవుడ్ హీరోల పేర్లు తన అభిమాన హీరోలుగా చెప్పడం ఏమిటని ఈ టాప్ హీరోల అభిమానులు చాల మంది అనుష్కకు వ్యతిరేకంగా తమ ఫేస్‌బుక్‌ల్లోను, ట్విట్టర్లలోనూ తమ కోపాన్ని వ్యక్త పరుస్తూ అనుష్క పై మాటల దాడి చేస్తున్నారు.  దక్షిణాది టాప్ హీరోలతో నటిస్తూ కోట్లు గణిస్తున్న ఈ స్వీటీకి బాలీవుడ్ హీరోల పై అభిమానం ఏమిటో అర్ధం కావడంలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: