ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ వెంకటేష్ హీరోగా నిర్మించిన ‘దృశ్యం' మూల కధను సమకూర్చిన జీతు జోసఫ్ ఈ కధను జపాన్ రచయిత కీగో హిగాషినో రాసిన నవలలోని మూల కధను కాపీ కొట్టి మలయాళ మాతృక ‘దృశ్యం’ సినిమాకు కధను ఇచ్చారని ఏక్తాకపూర్ ఆరోపిస్తున్నట్లుగా మలయాళ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ జపాన్ రచయిత కీగో హిగాషినో వ్రాసిన ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' నవలను తాను హిందీలో సినిమాగా తీయడానికి ఆ నవల రైట్స్ తాను కొనుగోలు చేసానని ఏక్తాకపూర్ తన లీగల్ నోటీసులో పేర్కొన్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. తాము రైట్స్ దక్కించుకున్న నవల ‘దృశ్యం’ సినిమాగా మారి మలయాళంలో అదేవిధంగా తెలుగులో తమ పర్మిషన్ లేకుండా నిర్మింప బడటం తమకు షాకింగ్ గా మారిందని ఏక్తాకపూర్ వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది.  అయితే ఈ సినిమాకు మూలా కధను అందించిన జీతు జోసఫ్ మలయాళ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు అని తెలుస్తోంది. ఇప్పటికే రెండు భాషలలో నిర్మాణమై విజయం సాధించిన ‘దృశ్యం’ సినిమా గురించి ఇంత ఆలస్యంగా ఏక్తాకపూర్ స్పందించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా రీమేక్ ను తమిళంలో వచ్చే నెల నుండి మొదలు పెడుతున్నట్లు కమల్ హాసన్ ప్రకటించడంతో ఏక్తాకపూర్ ఏకంగా మూడు భాషల సినిమా నిర్మాతలతో యుద్ధం చేస్తుంది కాబోలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: