సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్ ను పట్టించుకునే వారు ఎవరూ ఉండరు. అందుకే పెద్దపెద్ద హీరోయిన్స్ కూడ ఫ్లాప్ లు అంటే భయపడిపోతారు. రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సినిమా ‘ఐస్ క్రీమ్' లో నటించి ఆసినిమా ఘోరంగా ఫ్లాప్ అయినా వరుస పెట్టి అవకాశాలు వస్తున్న యంగ్ హీరోయిన్ తేజస్వికి కలిసి వస్తున్న అదృష్టం ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. ఐస్ క్రీమ్ కరిగిపోయినా ఈసినిమాలో గ్లామర్ పరంగా తేజస్వి అదరగోట్టడంతో ప్రస్తుతం ఈ అమ్మడి పై చాలామంది దర్శకనిర్మాతల ద్రుష్టి పడింది అని వార్తలు వస్తున్నాయి. దీనితో ఈమెకు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. వర్మలగే తేజస్వి కూడా ‘ఐస్ క్రీమ్’ పరాజయానికి ఏమాత్రం షాక్ కాకుండా తనకు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి అని చెప్తోంది.  ప్రస్తుతం హీరోలు రామ్, విష్ణులు నటిస్తున్న సినిమాలలో కీలక పాత్రలు చేస్తున్న తేజస్వి త్వరలో నిత్యామీనన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కూడ ఒక ప్రముఖ పాత్ర చేయబోతోందని టాక్. అదేవిధంగా టివి యాంకర్ ఓంకార్ తన తమ్ముడుని హీరోగా పరిచయం చేస్తున్న సినిమాలో తేజస్విని హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి. ఏమైనా కరిగిన ‘ఐస్ క్రీమ్’ తేజస్వినికి అదృష్టంగా మారింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: