బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గానే కాకుండా సెక్సియస్ట్ బ్యూటీ గా కోట్లాది మంది అభిమానులను పొందిన దీపికా పదుకొనె తన ప్రియుడు రణవీర్ సింగ్ తో కలిసి ‘‘రామ్‌లీలా’’ సినిమా తరువాత ‘‘బాజీరావ్ మస్తానీ’’ అనే చిత్రంలో నటిస్తోంది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం ఈ ప్రేమికులు ఇద్దరు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నారు.  చారిత్రిక నేపధ్యం ఉన్న ఈ సినిమాలో బాజీరావ్‌గా రణ్‌వీర్, మస్తానీగా దీపిక నటిస్తున్నారు. ఈ సినిమాలో అనేక యుద్ధ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. రణ్‌వీర్, దీపికల రొమాంటిక్ కెమెస్ట్రీ తో ‘‘రామ్‌లీలా’’ ఎటువంటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. అయితే ఈసారి మాత్రం వీరిద్దరూ మరాఠా యోధులుగా మారి బాలీవుడ్ ను అదర గొట్ట బోతున్నారు.  మహారాష్ట్రలో 1720 ప్రాంతంలో మరాఠా యోధుడిగా ప్రసిద్ధి గాంచిన బాజీరావ్ చరిత్రను ఎరగని వారు ఉండరు. బాజీరావ్ భార్య మస్తానీ డ్యాన్సర్ అయినప్పటికీ యుద్ధాల్లో తన భర్తకు అండగా నిలిచి చరిత్ర సృష్టించింది. వీరిద్దరి గురించి ఇప్పటికీ మరాఠా చరిత్రలో కధలు కధలుగా చెప్పుకుంటారు. మరి ఈ చారిత్రిక పాత్రలలో ఈ బాలీవుడ్ ప్రేమ జంట ఎలా రాణిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: