గతంలో రజనీకాంత్ నటించిన రోబో మూవీకి సీక్వెల్ రెడీ అవుతుందనే టాక్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, బిటౌన్ ని సైతం షేక్ చేసింది. ఎందుకంటే రజనీకాంత్ నటిస్తున్న రోబో2 మూవీలో బిటౌన్ స్టార్స్ కూడ సందడి చేయబోతున్నారు. ముఖ్యంగా అందులో షారుఖ్ ఖాన్ నటిస్తున్నాడనే టాక్ బలంగా వినిపించింది. గతంలో రోబో మూవీని శంకర్ మొదటగా షారుఖ్ తో చేయాల్సిఉంది. కాని చివరి నిముషంలో కా మూవీని రజీనీకాంత్ తో తీయాల్సి వచ్చింది. శంకర్ చెప్పిన స్టోరిలో భారీ మార్పులను షారుఖ్ సూచించడంతో అందుకు శంకర్ ఒప్పుకోలేదు. దీంతో ఆ మూవీలో రజనీకాంత్ నటించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే రజనీకాంత్ నటించిన రోబో మూవీ ఇండియన్ బాక్సాపీస్ వద్దే కాకుండా ఓవర్సీస్ లోనూ భారీ ఒపెనింగ్స్ ని, అలాగే కలెక్షన్స్ ని రాబట్టగలిగింది. తాజాగా రోబో మూవీకి సంబంధించిన సీక్వెల్ ని శంకర్ స్టార్ట్ చేసినట్టు, అందులో విలన్ గా షారుఖ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రోబో2 లో విలన్ గా షారుఖ్ కాకుండా, అమీర్ ఖాన్ నటిస్తున్నట్టుగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బలమైన కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమీర్ ఖాన్ విలన్ గా నటించిన థూమ్3 మూవీ టాప్ కలెక్సన్స్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు రోబో2 లో రజనీకాంత్ లో పాటు అమీర్ ఖాన్ నటిస్తే ఆ మూవీ కచ్ఛితంగా అయిదు వందల కోట్ల రూపాయలను రెండో వారంలోనే కలెక్ట్ చేస్తుందని అభిమానుల లెక్కలు కడుతున్నారు. మొత్తానికి రోబో2 మూవీకి సంబంధించిన వివరాలను త్వరలోనే శంకర్ బయటకు అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: