ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు, ఎలాంటి అవకాశాలు వస్తాయో తెలియదు. ముఖ్యంగా ఒకనాటి నెంబర్ వన్ హీరోయిన్స్ పని అయిపోయిందనుకున్న సమయంలోనే వారికి మరో పెద్ద బ్రేక్ వచ్చి, మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీపై హావాను కొనసాగించవచ్చు. ఇదిలా ఉంటే సరిగ్గా ఇలాంటిదే ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటి జరగబోతుంది. రీసెంట్ గా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బంపర్ సక్సెస్ సాధించిన క్వీన్ మూవీని, సౌత్ లో రిమేక్ చేయటానికి భారీ రైట్స్ ని తీసుకున్నాడు. క్వీన్ మూవీ రీమేక్ రైట్స్ కొనడం అంటే కొన్నాడు కానీ, దానికి హీరోయిన్ ని సంపాదించడంలో మాత్రం ఆ నిర్మాత అష్టకష్టాలు పడుతున్నాడు. ప్రముఖ తమిళ నటుడు త్యాగరాజన్ ఈ సినిమా హక్కులను భారీ రేటుకి సొంతం చేసుకొని చాలా రోజులు అయింది. అయితే ఇందులో హీరోయిన్ గా సెలక్ట్ చేయటానికి త్యాగరాజన్ చాలా మంది టాప్ హీరోయిన్స్ ని సంప్రదించినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో క్వీన్ తెలుగు మూవీ రిమేక్ లో టాప్ హీరోయిన్స్ నటించటానికి భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నారు. అందుకు త్యాగరాజన్ ఆసక్తి చూపటం లేదు. సక్సెస్ ఫుల్ స్టోరి కావడంతో ఈ మూవీలో ఏదేనా స్టార్ డం కలిగి ఉండి, డిమాండ్ లేని హీరోయిన్ ని తీసుకుంటే మంచిదని ఆలోచించాడంట. దీంతో ఇప్పుడు త్రిషను కాంటాక్ట్ చేస్తున్నాడట. ప్రస్తుతం త్రిషకి అవకాశాలు ఏమి లేకపోవడంతో తను క్వీన్ సౌత్ రిమేక్ లో నటించటానికి ఆసక్తిని చూపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా టాప్ హీరోయిన్స్ నుండి క్వీన్ సౌత్ రిమేక్ ఆఫర్ త్రిషకి వెళ్ళటంతో, త్రిష తెగ సంతోష పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: