సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తున్న హీరోయిన్ నయనతార. నయనతార ప్రస్తుతం సెలెక్టెడ్ మూవీలనే చేస్తుంది. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. తన ఫిల్మ్ కెరీర్ మంచి సక్సెస్ రూటులో ఉన్నప్పుడు చాలా రకాల గ్లామర్ పాత్రలను చేసింది. అలాగే మైథిలాజికల్ మూవీలను చేసి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఇప్పుడు నయనతార కంటే సూపర్ హీరోయిన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నప్పటికీ, నయనతార అంటే ఇష్టపడే హీరోలు, డైరెక్టర్స్ చాలా మందే ఉన్నారు. అందుకే నయనతార అంటే ఇప్పటికీ ఫుల్ డిమాండ్ ఉంది. ఒక్కో మూవీకి తను తీసుకునే రెమ్యునరేషన్ దాదాపు కోటి రూపాయల వరకూ చేరుకుంటుందని లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే నయనతార మోజులో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి ఉన్నాడు. విజయ్ సేతుపతి అంటే మనకు అంతగా తెలియదు కాని, కోలీవుడ్ లో మాత్రం ఇప్పడిప్పుడే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్న యంగ్ హీరో. ఈ హీరో తెలుగులో వచ్చిన పిజ్జా అనే మూవీలో నటించాడు. అలాగే సూదుకవ్వం అనే సూపర్ హిట్ చిత్రంలో అమ్మాయిలను కిడ్నాప్ చేసే పాత్రలో ఈ హీరో నటించి అదరగొట్టాడు. ఇదిలా ఉంటే కోలీవుడ్ కి చెందిన ఓ టెలివిజన్ ఛానల్ లో విజయ్ సేతుపతిని ఓ ఛానల్ ఇంటర్వూ చేసింది. ఆ ఇంటర్వూలో యంకర్ చిలిపి ప్రశ్న అడిగింది. తనని రియల్ లైఫ్ లో పోలీసులు పట్టుకుంటే ఎక్కడ పట్టుబడాలని ఉంది అని అడిగింది. అందుకు విజయ్ తను నయనతార బెడ్ రూంలో దొరికితే బాగుంటుంది, ఎందుకంటే తన అందం అలాంటిది అని చెప్పి సిగ్గుపడ్డాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: