టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూవీలలో ఒకటి రుద్రమదేవి. రుద్రమదేవి మూవీని డైరెక్టర్ కం ప్రొడ్యూజర్ గుణశేఖర్ అహర్నిశలు శ్రమపడి భారీబడ్జెట్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో చాలా విశేషాలు ఉన్నాయి. అయితే అందులో ఒకటి అనుష్క వేసుకుంటున్న ఆభరణాలు. ఏదైనా షూటింగ్ కోసం ఆర్టిస్ట్ లు ధరించే ఆభరణాలు నకీలుగా ఉంటాయి. అందుకు భిన్నంగా రుద్రమదేమి మూవీలో అనుష్క ధరిస్తున్న ఆభరణాలు నిజమైన బంగారంతో చేయబడినవి. అలాగే తను ధరించే రత్నాలు కూడ నిజమైనవిగా చిత్ర యూనిట్ నుండే కాక స్వయంగా గుణశేఖర్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అనుష్క షూటింగ్ జరుగుతున్నంత సేపు, అనుష్క వేసుకున్న అభరణాలపై ప్రత్యేక కేరింగ్ ఉంటుంది. అనుక్షణం వాటిని గమనిస్తూ ఇద్దరూ వ్యక్తులు ఉంటారట. అయితే ఇప్పుడు రుద్రమదేవి పాత్ర కోసం ధరించిన బంగారు ఆభరణాలను ఎవరో దొంగిలించారు. తాజాగా నానక్రామ్ గూడా లో వేసిన రుద్రమదేవి సెట్ లో ఈ వ్యవహారం జరిగింది. ఇదంతా నిన్న సాయంత్రమే జరిగింది. అలాగే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. షూటింగ్ బ్రేక్ టైం లో కార్ వాన్ లో నగలను పెట్టారు. కార్ వాన్ నుండి అలాగే ఫిల్మ్ సెట్ నుంచి ఒకటిన్నర కేజీ బంగారం ఉన్న బాగ్ ని తీసుకెళ్లడం చాలా కష్టమైన పని. అందుకే, దాన్ని అక్కడే, ఎక్కడో ఒక చోట దాచి పెట్టి ఉంటారని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి బయటి వారిని ఎవరిని సెట్ లోకి రానివ్వటం లేదు. పోలీసులు ఇప్పటికే ఓ అనుమాతిడ్ని అదుపులోకి తీసుకున్నట్టుగా టాలీవుడ్ నుండి అందిన సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: