నందమూరి తారక రామారావు పేరు చెప్పగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది రాముడు, కృష్ణుడు పాత్రలతో పాటు శ్రీక్రష్ణదేవరాయలు గా ఆయన అత్యంత దర్పంగా నటించిన ఆయన నటనా కౌశలం. అటువంటి కృష్ణదేవరాయల పాత్రను కొంత వరకు బాలకృష్ణ నటించి మెప్పించాడు. అటువంటి ప్రాముఖ్యత ఉన్న చారిత్రిక పాత్రకు రామ్ చరణ్ చేత నటింప చేయడానికి ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో ఒక చారిత్రిక సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తున్న అసుతోష్ గోవార్కర్ కు ఎప్పటి నుంచో విజయనగర సామ్రాజ్య వైభవం పై ఒక భారీ సినిమా తీయాలని కోరికట.  దీనికి సంబంధించి కృష్ణదేవరాయల జీవితం పై ఈ బాలీవుడ్ దర్శకుడు అప్పుడే పరిశోధన కూడ ప్రారంభించాడని టాక్. ఈ నేపధ్యంలో ఈమధ్య అశుతోష్ గోవార్కర్ తన డ్రీమ్ ప్రాజెక్టు శ్రీకృష్ణదేవరాయలు గురించి రామ్ చరణ్ కలిసి ఆ సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలుగా చరణ్ నటించడానికి ఒప్పుకుంటే ఈ సినిమాను బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడ కలిపి ద్విభాషా చిత్రంగా నిర్మిస్తానని అశుతోష్ ఇచ్చిన ఆఫర్ కు చరణ్ తాను కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే అటువంటి చారిత్రిక సాహసం రామ్ చరణ్ చేస్తాడా అనే సందేహం చాలామందిలో ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: