హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాక ఎవరైనా ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఉంటారు. కాని టాప్ హీరోయిన్స్ గా టాలీవుడ్ ను షేక్ చేస్తున్న శ్రుతి తమన్నాలు ఐటమ్ గర్ల్స్ గా మారి అదరగొట్టే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న రెండు భారీ సినిమాలు ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి. ఈవారం విడుదల అవుతున్న ‘అల్లుడు శీను’ సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తూ ఉంటె దసరా పండుగ ముందు రాబోతున్న ‘ఆగడు’ సినిమాలో శ్రుతి ఐటమ్ సాంగ్ చేస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ రెండు ఐటమ్ సాంగ్స్ కు ఈ సినిమా నిర్మాతలు ఈ ముద్దుగుమ్మలకు భారీ పారితోషికం ఇవ్వడమే కాకుండా ఈ రెండు ఐటమ్ సాంగ్స్ ను చాల రిచ్ గా చూపెట్ట బోతున్నారు అనే టాక్ నడుస్తోంది.  ‘ఆగడు’ సినిమా కోసం శ్రుతి మహేష్ ల మధ్య చిత్రీకరించబోతున్న ఐటమ్ సాంగ్ కు సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడు అనే టాక్ ఇప్పటికే వినపడుతోంది. ఇద్దరు టాప్ హీరోయిన్స్ ఐటమ్ గర్ల్స్ గా మారి ఈ రెండు సినిమాలకు చేస్తున్న హంగామా నేపధ్యంలో ఈ రెండు సినిమాలలోని ఏ ఐటమ్ సాంగ్ టాప్ ప్లేస్ సంపాదించుకుంటుంది అన్న విషయం పై అప్పుడే టాలీవుడ్ లో లెక్కలు మొదలై శ్రుతి, తమన్నాల వార్ కు తెర లేస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: