సెంటిమెంట్ల నమ్మకం గోపీచంద్ ను కూడ తాకింది. హీరోలు అంతా తమకు కలిసి వచ్చిన అక్షరాల సంఖ్య తో తమ సినిమాల టైటిల్స్ ను పెట్టుకుని హిట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే గోపీచంద్ మాత్రం తన సున్నా సెంటిమెంట్ తో మరొక నూతన ఒరవడికి తెర తీస్తున్నాడు. గత సంవత్సరం విడుదల అయిన తన ‘సాహసం’ సినిమా ద్వారా తన ఫెయిల్యూర్ రికార్డుకు విరామం ప్రకటించిన గోపీచంద్ తన లేటెస్ట్ సినిమాకు ఈ ‘సున్నా’ సెంటిమెంట్ ను నమ్ముకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చంద్రశేఖర్‌ యేలేటి దగ్గర సహాయకుడిగా పనిచేసిన రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వలంలో రూపొందుతున్న గోపిచంద్ కొత్త చిత్రం కోసం ఈ సినిమా యూనిట్ ‘లౌక్యం’ అనే టైటిల్ ను పెట్టాలని ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో శౌర్యం, శంఖం, రణం, సాహసం వంటి టైటిల్స్ గోపిచంద్ కు కలిసి రావడంతో ఆ టైటిల్స్ లోని 'సున్నాను' బేస్ చేసుకుని ఈ కొత్త సినిమాకు ‘లౌక్యం’ అని టైటిల్ పెడుతున్నట్లు టాక్. ‘మిర్చి’ లాంటి సూపర్ హిట్ సినిమాను తీసిన నిర్మాతల దగ్గర నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై గోపీచంద్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు అని అంటున్నారు. మరి గోపీచంద్ కు ఈ సున్నా సెంటిమెంట్ ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: