విలక్షణమైన పాత్రలు చేసే హీరో విశాల్ కు ఒక విచిత్రమైన అలవాటు ఉందని అతడే స్వయంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. విశాల్ కు నిరాస కలిగినప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈహీరో తన ఇంటిలో తన గదిలో ఉండే జీసస్ ఫోటోతో మాట్లాడుతూ తన బాధలు చెప్పుకుంటాడట. అంతేకాదు ఆ సమయంలో తనను ఎవరైనా చూస్తే ఖచ్చితంగా తనను పిచ్చి వాడి కింద లెక్క వేస్తారని విశాల్ తన సీక్రెట్ ను నిన్న ఒక ప్రముఖ పత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వెండి తెర పై ఆరడుగుల పొడుగుతో కనిపించే విశాల్ ని చిన్నప్పుడు తన స్కూల్ పిల్లలు అందరూ పొట్టి అని ఏడిపించేవారట.  దీనికి కారణం విశాల్ తన చిన్నప్పుడు చాల పొట్టిగా ఉండేవాడినని అని అంటున్నాడు. పొడుగు వాళ్ళను చూసి తెగ జెలసీ ఫీల్ అయ్యేవాడినని అని అంటూ ఒక టీచర్ ఇచ్చిన సలహాతో బాస్కెట్ బాల్ ఆడటం మొదలు పెట్టాక తాను పొడవు అయ్యానని చెపుతున్నాడు. అంతేకాదు చిన్నప్పుడు చదువులో పూర్తిగా వెనక పడి ఉండే విశాల్ కు చదువు అంటే భూతంలా కనిపించేదని అంటున్నాడు. ఇలా తన చిన్ననాటి ఎన్నో విషయాలు గుర్తుకు చేసుకున్నాడు ఈ క్రేజీ హీరో సినిమా దర్శకుడుని అవుదాము అని కలలు కన్నా విశాల్ కు రామ్ గోపాల్ వర్మ అంటే విపరీతమైన ఇష్టం అని అంటున్నాడు. అయితే వర్మకు ఈ విషయం తెలిస్తే విశాల్ పై కూడ ఒక ప్రయోగాన్ని చేయడానికి వర్మ రెడీ అయిపోతాడు అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: