టాలీవుడ్ సినిమా రంగం లో ఇప్పటి వరకు ఏ హీరో అందుకోని ఒక సరికొత్త శిఖరాన్ని ప్రభాస్ అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న బాహుబలి బడ్జెట్ 175 కోట్లకు చేరుకున్నట్లుగా వార్తలు వస్తున్నట్లే ఈ సినిమాకు సంభందించి ప్రభాస్ తీసుకొంటున్న పారితోషికం విషయంలో కూడ సరికొత్త వార్తలు ఊపు అందుకున్నాయి. ఇప్పటి వరకూ ఈ సినిమాకు ప్రభాస్ 18 నుంచి 20 కోట్లు పారితోషికం అందుకున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా నిర్మాణం అనుకున్న సమయంకన్నా ఎక్కువ రోజులు కొనసాగే పరిస్థుతులు ఏర్పడటం దీనితో పాటు ఈ సినిమా బడ్జెట్ కూడా 175 కోట్లకు చేరుకోవడంతో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఇదే సినిమా పై ప్రభాస్ తన దృష్టిని అంతా నిలపవలసిన పరిస్థుతులు రావడంతో ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా నిర్మాతలు ప్రభాస్ పారితోషికాన్ని కూడ పెంచారు అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.  ఈ వార్తలే నిజం అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో ఒకేఒక్క సినిమాకు సంబంధించి అత్యధిక పారితోషికాన్ని పొందిన హీరోగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేస్తాడు. అంతేకాదు టాలీవుడ్ చరిత్రలో 100 కోట్ల కలెక్షన్స్ స్థాయిని మించి రికార్డు క్రియేట్ చేసిన హీరోగా కూడ ప్రభాస్ చరిత్రకు ఎక్కుతాడు. ఇన్ని సంచలనాలు ఉన్నాయి కాబట్టే ‘బాహుబలి’ కోసం ప్రభాస్ తన పెళ్ళినే వాయిదా వేసుకున్నాడు అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: