టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన హీరో సిద్దార్ధ్. తను నటించిన మూవీలు దాదాపు సక్సెస్ ని చూడటంలో కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ సిద్దార్ధ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే బొమ్మరిల్లు సక్సెస్ తరువాత హీరో సిద్దార్ధ్ లో కాన్ఫిడెంట్ లెవల్స్ మరింతగా పెరిగి దర్శకులని, నిర్మాతలని లెక్కచేయడం లేదనే టాక్ వచ్చింది. చాలా సందర్బాల్లో సిద్దార్ధ్ కి దర్శకులతోనూ, నిర్మాతలతోనూ గొడవలు ఏర్పడిన సందర్భాలు కూడ ఉన్నాయి. ఇంతటితో ఆగకుండా సినీ ప్రేక్షకులతోనూ సిద్దార్ధ్ కాంట్రివర్సీ సెలబ్రిటిగా మారాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా తను నటించిన తాజా చిత్రం ‘జిగర్తాండ’. ఈ మూవీలోనూ నిర్మాతలతో సిద్దార్ధ్ గొడవ పడినట్టిగా తెలుస్తుంది. అయితే ఈ గొడవకు కారణం విడుదల తేదీ వాయిదా పడటంతో మొదలయింది. మొదటగా ఈ చిత్రాన్ని శుక్రవారం, జూలై 25న విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ కి సమాచారం. ఇదే మూవీని తెలుగులో ‘చిక్కడు దొరకడు’ పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. సిద్దార్ధ్ సరసన లక్ష్మి మీనన్ హీరోయిన్ గా చేస్తుంది. అయితే ఒక్కసారిగా ఇప్పుడు రిలీజ్ డేట్స్ మారిపోయాయి. సహా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకి సినిమా విడుదల చేయడం లేదనే వార్తను స్వయంగా తెలిపిన నిర్మాత కదిరేశన్, తనకు చెప్పకపోవడంపై హీరో సిద్దార్ధ్ తెగ కోప్పడుతున్నాడు. అంతేకాకుండా తన కోపాన్ని ట్విట్టర్లో వ్యక్తచేశాడు. “దర్శకుడు కార్తీక్, నేను. సినిమా టెక్నిషియన్స్ అందరూ ‘జిగర్తాండ’ చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. కనీసం మాతో చెప్పకుండా విడుదల వాయిదా వేశారు. దీనికి కారణం కొందరు వ్యక్తులు, వారి నీచ రాజకీయాలు. వారు సినిమా విడుదలను మాత్రమే అడ్డుకోగలరు, సినిమా విజయాన్ని కాదు. ప్లీజ్ సపోర్ట్ కార్తీక్ & ‘జిగర్తాండ’ టీం. త్వరలో కొత్త విడుదల తేదిని తెలుస్తుంది” అంటూ సిద్దార్ధ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. నిజానికి తెలుగులో ఈ సినిమాను పంపిణి చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అందుకే విడుదల వాయిదా వేశారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: