పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకి ఓ గుడ్ న్యూస్ ని అందిస్తున్నాడు. తను రాజకీయాలలోకి రాకముందు పవన్ కి సెకెండ్ లైఫ్ ని ఇచ్చిన గబ్బర్ సింగ్ మూవీకి సంబంధించిన సీక్వెల్ ని అతి త్వరలోనే సెట్స్ మీదకు తీసుకుపోతున్నాడు. గబ్బర్ సింగ్2 మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు, అలాగే షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ సిద్ధంగా ఉండగా, కేవలం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవటంతోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ లో డిలే జరుగుతూ వచ్చింది. 2014 ఎన్నికల కారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి బాగా విరామం ఇచ్చాడు. పవన్ నటించాల్సిన ‘గబ్బర్ సింగ్ 2′ సినిమా లాంచనంగా ప్రారంభమైంది కానీ, షూటింగ్ కి చెందిన ప్రోగ్రెస్ మాత్రం కొద్దిగ కూడ ముందుకు కదలలేదు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన చిత్రయూనిట్ లోని వ్యక్తుల నుండి అందిన సమాచారం ప్రకారం ‘గబ్బర్ సింగ్ 2′ని ఆగష్టు 3వ వారం నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలియజేశారు. సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గోపాల గోపాల మూవీ షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. మొత్తానికి పవన్ కళ్యణ్ నటించబోతున్న గబ్బర్ సింగ్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుండటంతో, అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: