విక్టరీ వెంకటేష్ పరాజయాల ట్రాక్ రికార్డు కు బ్రేక్ ఇస్తూ ఈమధ్యనే విడుదల అయి హిట్ టాక్ తో దూసుకు పోతున్న ‘దృశ్యం’ సినిమా పై ఒక ఆశక్తి కర టాక్ వినపడుతోంది. ‘దృశ్యం’ దర్శకురాలు శ్రీప్రియ ఈ సినిమా పై కామెంట్స్ చేసినట్లుగా వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ సినిమా హిట్ కావడానికి తన కృషి, పట్టుదలే కారణం అని డైరెక్టర్ శ్రీప్రియ కామెంట్స్ చేయడమే కాకుండా తన గురించి తాను చాల గొప్పగా తన సన్నిహితులతో చెప్పుకుంటున్నట్లుగా ఫిలింనగర్ లో ఒక ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం ఎవరు ఎందుకు శ్రీప్రియను టార్గెట్ చేస్తూ చేస్తున్నారో తెలియకపోయినా వస్తున్న వార్తలు మటుకు ఈ సినిమా హీరో వెంకటేష్ కు కూడ షాకింగ్ గా మారాయి అని అంటున్నారు.  సినిమా జయాపజయాలలో దర్శకుడికి ప్రధాన పాత్ర ఉన్నా సినిమా విజయం అన్నది అందరి సమిష్టి కృషి అన్న విషయం 100 సినిమాలు పైగా నటించిన శ్రీప్రియకు తెలియదా అనే సెటైర్లు కూడ ఆమె పై పడుతున్నాయి. శ్రీప్రియ చేసిన కామెంట్స్ లో ఎన్నినిజాలో తెలియకపోయినా చాలారోజుల తరువాత టాలీవుడ్ లో ఒక మహిళా దర్శకురాలి సినిమా విజయం సాధించడం శ్రీప్రియ అదృష్టం అనుకోవాలి. శ్రీప్రియ కామెంట్స్ పై ఫిలింనగర్ లో వస్తున్న రూమర్స్ కు ‘దృశ్యం’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న వెంకటేష్ షాక్ అయ్యాడనే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: