భారతీయ సినిమా రంగాన్ని బూతు ఏవిధంగా ప్రభావితం చేస్తోందో తెలియ పరిచే మరో ఆశక్తికర విషయం గతవారం బాలీవుడ్ లో జరిగింది. హాట్ హాట్ సీన్స్, సెక్సీ సన్నీ, పింక్ లిప్స్ ప్రమోషనల్ సాంగ్, క్రైమ్ కధ ఇవన్నే కలిసి ఒక బాలీవుడ్ నిర్మాతకు కేవలం మూడు రోజులలో 18 కోట్ల ధన వర్షాన్ని కురిపించింది.  8 కోట్లతో తీసిన సినిమా విడుదల అయిన మూడు రోజులలోనే 18 కోట్లు వసూలు చేయడం ఇప్పుడు బాలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారింది. గత శుక్రువారం 18న రిలీజ్ అయిన ‘హేట్ స్టోరీ 2’ ఈ క్రెడిట్ దక్కించుకుని సంచలనాలు నమోదు చేస్తోంది.  విశాల్ పాండ్యా డైరెక్షన్‌లో పాపులర్ బ్యానర్ టీ సీరీస్ విక్రమ్ భట్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ విడుదల సమయంలోనే సెన్సార్ అభ్యంతరాలను ఎదుర్కుంది. అలాంటి పరిస్థులలో ఈ సినిమా సెన్సార్ నుంచి బయటకు వస్తుందా అని అనుకున్నారు అంతా. అయితే అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ ఈ సినిమా విడుదల కావడమే కాకుండా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.  ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ సుశాంత్ సింగ్ - సుర్వీన్ చావ్లా మధ్య చిత్రీకరించిన 20 హాట్ హాట్ రొమాంటిక్ సీన్స్‌కు థియేటర్లలోని ప్రేక్షకులు మైమరిచిపోయి ధన వర్షాననికి కారకులు అయ్యారని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: