మంచు ఫ్యామిలీ సెటైర్లు వేయడంలో సిద్ధహస్తులు. మోహన్ బాబు దగ్గర నుంచి మంచు లక్ష్మి వరకు ఎవరినైనా తమ మాటలతో టార్గెట్ చేయగల సమర్ధులు. ‘లక్ష్మి టాక్ షో’ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సెలెబ్రెటీగా మారిన మంచు వారి అమ్మాయి లక్ష్మి ఈమధ్యనే మా టివి ఛానల్ లో ప్రసారం అవుతున్న నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు అతిధిగా వచ్చి సందడి చేసింది. ఎప్పటిలాగే మంచు లక్ష్మి తన  బాడీ లాంగ్వేజ్ మరియు తన టిపికల్ అమెరికన్ ఇంగ్లీష్ స్లాంగ్ తో ఆరోజు కార్యక్రమానికి మంచి క్రేజ్ తీసుకు వచ్చింది. అంతేకాదు ఈమధ్య సరగేట్ విధానం ద్వారా తాను తల్లిని అయిన విషయాన్ని తల్లిగా తను పొందుతున్న ఆనందాన్ని నాగార్జునతో షేర్ చేసుకుంది. ఇంకా తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు నాగార్జునతో షేర్ చేసుకున్న లక్ష్మి ఆ షో ఎండింగ్ సమయంలో నాగార్జున కూడ ఊహించని షాక్ ఇచ్చింది ఈ మంచు వారి అమ్మాయి. నాగార్జున అడిగిన ప్రశ్నలకు అన్నిటికి తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చిన లక్ష్మి చివరన ప్రేక్షకుల ముందు సెలవు తీసుకుంటూ తనను గతంలో బుల్లితెర పై ప్రోత్సహించినట్లుగానే నాగార్జునను కూడ ఈ కోటీశ్వరుడు షో ద్వారా ప్రోత్సహించమని ప్రేక్షకులకు సందేశం ఇచ్చిన మంచు లక్ష్మి మాటలు విన్న నాగార్జునే కాకుండా ఆ షోను చూస్తున్న ప్రేక్షకులు కూడ ఒక్క నిముషం షాక్ అయ్యారు. మంచు వారి పంచ్ అలాగే ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: