విభిన్న సినిమాలు తీయడమే కాదు తన నవ్వుతో విభిన్నంగా కనిపించే పూరి జగన్నాద్ కట్టుకున్న కొత్త ఇల్లు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. భాగ్యనగరంలోని అత్యంత ధనవంతులు నివాసం ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో సుమారు 18000 వేల చదరపు అడుగులతో దాదాపు 20 కోట్ల విలువ చేసే ఈ ఇల్లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ ఇంటిలో అత్యంత విలాస వంతంగా నిర్మించబడిన క్రింది భాగంలో పూరి సినిమా ఆఫీసు ఉంటే మొదటి అంతస్తులో చూసిన వారికి కళ్ళు చెదిరిపోయేలా ఉన్న పూరి ఇంటిలోని బెడ్ రూమ్స్ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. పూరీ తన సన్నిహితులతో ఎంజాయ్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఒక విలాస వంతమైన బార్ తో పాటు హోమ్ ధియేటర్ కూడ ఆ ఇంటిలోని ప్రత్యేకత. కాలిఫోర్నియా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గ్రే స్టోన్ తో పాటు చాల ఖరీదైన ఇంపోర్టెడ్ స్టీల్ తో అడుగడుగునా సంపద కనిపించే విధంగా పూరి నిర్మించుకున్న ఈ ఇంటికి ‘కేవ్’ (గుహ) అని పేరు పెట్టుకున్నాడు పూరి. దీని భావన ప్రపంచం అనే అరణ్యంలో తాను కుడా  ఒక జంతువును కాబట్టి తన ఇంటికి ‘కేవ్’ అనే పేరు పెట్టుకున్నాను అని అంటున్నాడు ఈ విలక్షణ దర్శకుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: