టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలు ఊపందుకున్నాయి. ఇందుకు కారణం కేవలం అనుష్క నటించిన అరుంధతి మూవీనే అని చెప్పాలి. ఆ మూవీ సాధించిన సక్సెస్ ఈ తరహా మూవీలకి అవకాశాన్ని ఇచ్చింది. అనుష్క నటించిన అరుంధతి మూవీ తరువాత చాలా మంది డైరెక్టర్స్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలను తెరకెక్కించారు. అయితే అరుంధతి మూవీకి వచ్చినంత క్రేజ్ ఏ మూవీకి రాలేదు. ఇదిలా ఉంటే ఉప్పుడు అనుష్క ముందుకి అరుంధతి సీక్వెల్ వ్యవహారం తెరపైకి వస్తుంది. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుష్క భారీ బడ్జెట్, అలాగే క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. ఈ మూవీలు పూర్తైయ్యే సరికి దాదాపు ఒక సంవత్సర సమయం పడుతుంది. ఆ తరువాత అరుంధతి మూవీ సీక్వెల్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అరుంధతి మూవీ ప్రొడ్యూజర్ అనుష్కని సంప్రదించినట్టుగా తెలుస్తుంది. అయితే అనుష్క తన రెమ్యునరేషన్ ని భారీగా చెబుతున్నట్టుగా తెలుస్తుంది. ఫైనల్ గా మాత్రం అరుంధతి సీక్వెల్ లో నటించటానికి తను ఆసక్తి చూపుతున్నట్టుగా నిర్మాతకి తెలియపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క తెలుగు చిత్ర సీమకి పరిచయమై 9 వసంతాలు పూర్తి చేసుకుంది. అనుష్క హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా ‘సూపర్’ 2005 జూలై 21న రిలీజ్ అయ్యింది. ఈ 9 సంవత్సరాల కెరీర్ లో అనుష్క 29 సినిమాల్లో నటించింది. వీటిలో దాదాపు 20 వరకూ తెలుగు సినిమాలు ఉంటే, 9 తమిళ సినిమాలు ఉన్నాయి. అనుష్క ముందు ఉన్న 4 క్రేజీ ప్రాజెక్ట్స్ లో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’తెలుగు చిత్రాలు అయితే, తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘లింగా’, మరో స్టార్ హీరో అజిత్ సరసన ఓ సినిమా చేస్తోంది. మొత్తానికి త్వరలోనే అరుంధతి మూవీకి సంబంధించిన సీక్వెల్ పై అధికారిక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: