ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది హీరోలు సినిమాలలో నటిస్తూనే మరో వైపు బిజినెస్‌లు చేస్తూ కోట్లు గణిస్తున్నారు. గత కొద్ది కాలంగా టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం పై కన్ను వేసిన చరణ్ నెంబర్ వన్ వ్యాపారవేత్తగా మారడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రాంభించాడు. ఒక ప్రముఖ ఛానల్ లో బోర్డు డైరెక్టర్ గా ఉన్న చరణ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత వృద్ది చేసుకోవాలి అన్న ఉద్దేశ్యంతో ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి కూడ అడుగు పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం చరణ్15 కోట్ల షేర్ క్యాపిటల్, మరో రూ.12 కోట్ల పెయిడప్ క్యాపిటల్‌తో 'టర్బో మెగా ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్' పేరిట ఒక కంపెనీని రిజిస్టర్ చేయించాడు అని తెలుస్తోంది. బేగంపేట్‌లో ఉన్న ఎయిర్ పోర్టునుంచి దక్షిణాది రాష్ట్రాలలోని ముఖ్య నగరాలను కనక్ట్ చేస్తూ చరణ్ ప్రారంభించబోతున్న విమాన సంస్థ కార్యకలాపాలు ఉంటాయి అని టాక్. ఇప్పటికే చరణ్ భార్య ఉపాసన అపోలో సంస్థలకు డైరెక్టర్ గా తన సత్తాను చాటుతున్న నేపధ్యంలో ఉపాసన ప్రభావంతో చరణ్ కూడ కార్పోరేట్ బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నాడు అని అనుకోవాలి.  దక్షిణాది హీరోలకు సంబందించి ఎయిర్ లైన్స్ బిజినెస్ సంస్థను స్థాపించిన మొదటి హీరోగా చరణ్ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు అన్న టాక్ వినపడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: