ఈ సారి మెగా అభిమానులకు చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న 150 సినిమా గురించి అఫీషియల్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు ఎవరనే చర్చ గత కొంతకాలంగా జోరుగా సాగుతున్నసంగతి తెలిసిందే. 150వ సినిమా కావడం కొంతకాలంగా కథ గురించి చాలా అన్వేషణ జరిగింది. బెస్ట్ స్టోరీ కోసం చాలా కథలు పరిశీలించారు. చిరంజీవి సినిమా అంటే ఆశామాషీ విషయం కాదు. సత్తా ఉన్న దర్శకుడు కావాలి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడిగా బోయపాటి శ్రీను పైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ సమాచారం వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి  సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం అయితేనే బాగుంటుందనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా చిరంజీవి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ రావడంతో అభిమానులు కొంత నిరాశకు గురికావడం జరిగింది.  చిరంజీవి తిరిగి సినిమాల్లో నటిస్తానని తెలిపినప్పటి నుంచి అభిమానుల్లో మళ్లీ ఆనందం వెల్లువిరిసింది. ఇక చిరంజీవి 150 వ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.ఆయన మళ్లీ తిరిగి సినిమాలపై దృష్టి సారిస్తున్నారనే ఆనందమే అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. చిరంజీవి కెరీర్లో అంత్యంత ముఖ్యమైన సినిమా కావడతో ఈచిత్రం నిర్మాణ బాధ్యతలను చరణ్ దగ్గరుండి చూసుకోబోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: