విలక్షణ నటుడు మోహన్ బాబు అంటే సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకత ఉంది. మోహన్ బాబు ఏ క్యారెక్టర్ చేసినా ఒక స్టయిల్ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. హీరో, విలన్, క్యారెక్టర్,కమేడియన్ ఏ క్యారెక్టర్ అయినా అలవోకగా జీవించేయగల నటుడు మోహన్ బాబు. దర్శకుడు,నిర్మాత దాసరి నారాయణ రావు గురువుగా ఓ గాడ్ ఫాదర్ గా మోహన్ బాబుకు ఎంతో చేయుతనిచ్చి ఆయన ఉన్నతికి ఎంతో దోహదం చేశాడు. ఇప్పటికీ ఏ సభలో అయినా ఏ ఇంటర్వ్యూలో అయినా మోహన్ బాబు దాసరి పేరు చెప్పకుండా ఉండరు. అంత గొప్ప అనుబంధంగా వారి బందం ఏర్పడింది. తెలుగు సినిమా పుట్టుపూర్వోత్తరాలు సాధించిన ప్రగతి అందుకొన్న మైలురాళ్లూ వెన్నుదన్నుగా నిలిచిన దర్శక నిర్మాతలు నటీనటులు సాంకేతిక నిపుణులు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఓ డాక్యుమెంటరీ రూపొందించేందుకు రడి అవుతున్నారు ఇందు నిమిత్రం 5 కోట్లు ఖర్చు పెడుతున్నరని సమాచారం. దాంతో తెలుగు సినిమా అభిమానులంతా మోహన్ బాబు ను మెచ్చుకుంటున్నారు. తెలుగులో ఏ హీరో చేయని పనిని ఆయన చేస్తుదుకు అభినందనలు తెలియచేస్తున్నారు. సాంకేతిక నిపుణులనూ తెలుగు సినిమా అందించింది. సినీ జగత్తు మురిసిపోయే సినిమాల్ని రూపొందించింది. ఈ చరిత్రని నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 'తెలుగు సినిమా చరిత్ర అందరికీ తెలియాలి. అందుకోసం మనం ఏమైనా చేయాలి అని నాన్న నాతో చెప్పారు. ఆయన కోసం చేస్తున్న చిరు ప్రయత్నం ఇది. 

మరింత సమాచారం తెలుసుకోండి: