ఈసారి త్వరలో జరగబోతున్న సౌత్ ఇండియన్ ఇంటర్ నేషనల్ అవార్డుల ఎంపిక గత కొద్ది సంవత్సరాలుగా ఎప్పుడూ సృస్టించనంత రగడ సృష్టిస్తూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ అవార్డుల జ్యూరీ లిస్టులో పవన్ మహేష్ లు ఉత్తమ నటుడి కేటగిరిలో పోటీ పడుతూ ఉండటంతో ఇప్పుడు అందరి ద్రుష్టి ఈ అవార్డుల పైనే ఉంది. గతసంవత్సరం పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ అలాగే మహేష్ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాల మధ్య ఆన్ లైన్ ఓటింగ్ పోటీ నువ్వా నేనా అని జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈ సంస్థ ఇచ్చే అవార్డుల ఎంపికలో ఆన్ లైన్ ఓటింగ్ కూడ చాలాకీలకం. దీనితో ఆన్ లైన్ ఓటింగ్ ప్రారంభమై కేవలం మూడు రోజులు గడవ కుండానే 4,30,000 హిట్స్ ఉత్తమ నటుడి ఎంపిక కోసం రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు నిన్నటి వరకూ జరిగిన ఆన్ లైన్ పోలింగ్ లో పవన్ కన్నా మహేష్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పోల్ అయిన ఓట్లలో 60% వరకు అమెరికాలోని తెలుగు వారు 15% వరకు ఇంగ్లాండ్ లోని తెలుగు వారు ఓట్లు వేసినట్లుగా తెలుస్తోంది.  ఇప్పుడు ఈ వార్తలు బయటకు రావడంతో ఫేస్ బుక్, ట్విటర్లలో ఈ ఆన్ లైన్ ఓటింగ్ కు సంబంధించిన హడావిడి మరింత పెరిగి పరోక్షంగా మహేష్ పవన్ ల మధ్య జరుగుతున్న ఆన్ లైన్ ఓటింగ్ వార్ గా మారింది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈసారి సౌత్ ఇండియన్ ఇంటర్ నేషనల్ అవార్డును ఎవర్ని వరిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: