మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించిన వర్మ ఈ మధ్యతన ‘ఐస్ క్రీమ్’ తో పవన్ సంగతి మర్చిపోయాడు. దీనితో రాజకీయాల పై వర్మ వ్యాఖ్యలు ఆగిపోయాయి అని అనుకున్నారు అంతా. అయితే అందర్నీ ఆశ్చర్య పరుస్తూ వర్మ మళ్ళీ యూటర్న్ తీసుకుని తిరిగి రాజకీయాల వైపు వచ్చాడు. అంతేకాదు ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పై ప్రశంసల పొగడ్తల వర్షం మొదలు పెట్టాడు వర్మ. మరో అడుగు ముందుకు వేసి కెసిఆర్ ముఖ్యమంత్రిగా చేస్తున్న పని తీరుపై ప్రశంసలు కూడ కురిపిస్తున్నాడు. కెసిఆర్. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాగా పని చేస్తున్నారని అంటూ శివసేన అధ్యక్షుడు దివంగత బాల్ థాక్రే, మహాత్మా గాంధీల కంటే కెసిఆర్ బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు వర్మ. ఇదే సందర్భంలో మరో అడుగు ముందుకు వేసి తాను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగానని అంటూ తాను తెలంగాణా బిడ్డనే అనే విషయాన్ని కెసిఆర్ దృష్టికి తీసుకు వచ్చాడు వర్మ. ఈ ట్విటర్ల ప్రహసనానికి మరో ట్విస్ట్ ఇస్తూ కెసిఆర్ పనితీరును చంద్రబాబు కూడ నేర్చుకుంటే బాగుంటుంది అని అభిప్రాయ పడ్డాడు వర్మ. ఎదిఎమైనా వర్మ ఏమి మాట్లాడినా సంచలనమే.   

మరింత సమాచారం తెలుసుకోండి: