తనకు వారసుడు పుట్టాడు అని ఆనందంలో ఉన్న జూనియర్ ఈ ఆనందం మధ్య పూరీ జగన్నాద్ నిర్మించుకున్న 20కోట్ల ‘కేవ్’ కు ఎన్టీఆర్ ఒక అరుదైన బహుమతి ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో నిర్మాత బండ్లగణేష్ నుండి డైమండ్స్ పొదిగిన ఒక ఖరీదైన కాస్టిలీ సిగరెట్ లైటర్ గిఫ్ట్ గా పొందిన పూరి అదృష్టం గురించి అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఈమధ్యనే పూరి కేవ్ పేరుతో సెవెన్ స్టార్ హోటల్ ను తలపించేలా తన ఇల్లును కట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిపోయాడు. త్వరలో జూనియర్ పూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న నేపద్యంలో ఆ సినిమాను పూరి జూనియర్ కోరుకునే బ్లాక్ బస్టర్ గా మారుస్తాడని కాబోలు పూరి ఆఫీసుకు, ఇంటికీ ఉపయోగపడేలా బాగా ఖరీదైన ఇంపోర్టెడ్ హౌస్ కాన్సర్ట్ స్పీకర్స్ ని గిఫ్ట్ గా ఇచ్చాడట. ఈ విషయాన్ని పూరి తన ట్విట్ ద్వారా తెలియచేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు జూనియర్ ఇచ్చిన గిఫ్ట్ తనకు ఎంతో నచ్చిందని తన ఆనందాన్ని యంగ్ టైగర్ అభిమానులతో పంచుకున్నాడు. జూనియర్ కు కలిసి వచ్చే కాజల్ కాంబినేషన్ పూరి డిఫరెంట్ స్టైల్ జూనియర్ కు పూరీతో చేయబోతున్న సినిమాలో ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: