బద్రి సినిమాతో ప్రేమలో పడి పవన్ కళ్యాన్, రేణూ దేశాయ్ ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం విధితమే. పెళ్లయిన కొత్తలో వీరు చాలా అన్యోన్యమైన దాంపత్యం గా మెలిగేవారు. కానీ కొంత కాలం తర్వాత ఇద్దరి మధ్య కొన్ని విభేదాల కారణం చేత రేణు దేశాయ్, పవన్ విడిపోయి జీవనం కొనసాగిస్తున్నారు. కానీ ఈ మధ్య రేణు దేశాయ్ తన మాజీ భర్తపై మమకారం పెరిగినట్లుంది. ట్విట్టర్ లో తన పిల్ల ల ఫోటోలు పవన్ తో కలిసి దిగిన ఫోటోలు ట్విట్ చేస్తూ పవన్ అభిమానుల అభిమానం చూరగొంటోంది.  అంతే కాదు ఈ మధ్య రేణు దేశాయ్ తో ఇంటర్ఫ్యూ జరిగింది అందులో పవన్ చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు. మృదు స్వభావి చాలా మంచితనం కలిగిన వ్యక్తి తన భర్తంటే తనకు చాలా ఇష్టం అని ఏ విషయం అయిన తనతో మనసు విప్పి మాట్లాడుతాడని చాలా గొప్పగా పొగిడింది. ఈ వీడియో కూడా ఈ మధ్య యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. ఈ మధ్య ఒక ఎక్స్ క్లూజీవ్ ఫోటో తను ట్విట్ చేసింది. 2013 లో ఒక చారిటీ మ్యాచ్ సందర్భంగా చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ క్రికెటర్స్, ఇండియన్ క్రికెటర్స్ ను తన ఇంటికి డిన్నర్ కి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేణూ దేశాయ్, పవన్, సచిన్ టెండుల్కర్ కలిసి దిగిన అపురూప చిత్రం మీకోసం...

మరింత సమాచారం తెలుసుకోండి: