యంగ్ హీరోలంతా పవన్ సినిమా పాటలను టైటిల్స్ గా మార్చుకోవడం సెంటిమెంట్ గా పెట్టుకుంటే బ్రహ్మనందం మరో అడుగు ముందుకు వేసి పవన్ సెంటిమెంట్ ను మరొక విధంగా ఉపయోగించుకుంటున్నాడు. బ్రహ్మనందం వల్ల సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నా బ్రహ్మి తన కొడుకుకి ఎంత ప్రయత్నించినా ఒక్క హిట్ కుడా ఇవ్వలేకపోతున్నాడు. బ్రహ్మి తనయుడు గౌతమ్ 'పల్లకిలో పెళ్లి కూతురు', 'వారెవా', 'బసంతి' చిత్రాల్లో హీరోగా నటించినా ఏ ఒక్క సినిమా కనీసపు హిట్ టాక్ ను కూడ తెచ్చుకోక పోవడం బ్రహ్మిని టెన్షన్ పెడుతోందని టాక్. గౌతమ్ నటించిన బసంతి సినిమాకు బ్రహ్మి రంగంలోకి దిగి టాలీవుడ్ స్టార్ హీరోల అందరితో సినిమాని ప్రమోషన్ చేయించినా కనీసపు ఓపెనింగ్స్ కూడ ఈ సినిమాకు రాకపోవడం బ్రాహ్మికి షాకింగ్ గా మారింది అని అంటారు.  అయినా సరే బ్రహ్మానందం తన కొడుకును హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నాలు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈప్రయత్నాల ఫలితంగా గౌతమ్ కి మరో అవకాశం వచ్చిందని టాక్. చాలాకాలంగా టాలీవుడ్ డైలాగ్ రైటర్ గా ఉన్న శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.  ప్రస్తుతం 'గబ్బర్ సింగ్ 2', 'పవర్' చిత్రాలకు డైలాగులు అందిస్తున్న శ్రీధర్ తను దర్శకత్వం వహించబోయే తొలి సినిమాలో గౌతమ్ ని హీరోగా ఎంచుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ సినిమాకు పనిచేస్తున్న డైలాగ్ రైటర్ సెంటిమెంట్ ను ఆధారంగా చేసుకుని బ్రహ్మనందం చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: