నిర్మాతలు తాము నిర్మించే సినిమాలలో అప్పుడప్పుడూ తెర పై కనిపిస్తూ వారి సరదా తీర్చుకుంటారు. ఆ లిస్టులో ప్రముఖ నిర్మాత రామానాయుడు ప్రధమ స్థానంలో ఉంటారు. అదేవిధంగా సుబ్బిరామిరెడ్డి, ఎమ్మెస్ రాజులు కూడ తాము నిర్మించిన సినిమాలలో కనిపించి సందడి చేసారు. చిన్న డిస్ట్రిబ్యూటర్ గా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు టాలీవుడ్ టాప్ నిర్మాతగా ఎదిగిన దిల్ రాజ్ కూడ నటుడిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది టాప్ హీరోలతో ఎన్నో భారీ సినిమాలను తీసిన దిల్ రాజ్ గతంలో తన సినిమాలలో ఎప్పుడు నటించలేదు. అయితే అంజలి హీరోయిన్ గా కోన వెంకట్ నిర్మిస్తున్న ‘గీతాంజలి’ సినిమాలో దిల్ రాజ్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గానే కనిపిస్తూ ఒక ప్రత్యేక పాత్రను చేసాడని ఫిలింనగర్ టాక్. అంజలికి తాను నిర్మించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ద్వారా మంచి క్రేజ్ ను క్రియేట్ చేసిన దిల్ రాజ్ తాను ప్రత్యేక పాత్ర చేస్తున్న ‘గీతాంజలి’ సినిమా ద్వారా అంజలికి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చి పెడతాడేమో చూడాలి. ఎదిఎమైనా నిర్మాతలుగా ఉండి యాక్టర్లుగా మారిపోయిన నిర్మాతల లిస్టులో దిల్ రాజ్ కూడ చేరిపోయాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: