భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్ ఐ మూవీ చిత్రీకరణలో బిజిగా ఉన్నాడు. దాదాపు ఐ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని శరవేగంగా జరుపుకుంటుంది. ఈ దీపాలళికి ఐ చిత్రాన్ని రిలీజ్ చేయాలని శంకర్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని వేగవంతం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ శంకర్ తెరకెక్కిస్తున్న మూవీలలో తను తీసుకునే రెమ్యునరేషన్ ఎంత అనే వివరాలు బయటకు రాలేదు. మొదటి సారిగా తను రెమ్యునరేషన్ వివరాలు బయటకు వస్తున్నాయి. ఐ మూవీ తరువాత శంకర్ దర్శకత్వం వహింబోతున్న చిత్రం రోబో2. రోబో2 మూవీలో శంకర్ రెమ్యునరేషన్ రజనీకాంత్ కి సరిసమానంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా శంకర్ కూడ మొదటిసారి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నగా కోలీవుడ్ లో ప్రత్యేక కథనాలు వినిపిస్తున్నాయి. ఐ చిత్రం తరువాత శంకర్ తెరకెక్కిస్తున్న రోబో సీక్వెల్ కి సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ మీ ముందుకు తీసుకువస్తుంది. రోబో2 మూవీలో హీరోగా రజనీకాంత్ నటిస్తుంటే, విలన్ గా అమీర్ ఖాన్ నటించే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ కి చెందిన సీనియర్ పి.ఆర్, అమీర్ ఖాన్ తో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం తెలుస్తుంది. రోబో2 మూవీలో రజనీకాంత్ దాదాపు 22 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇంతే స్థాయిలో డైరెక్టర్ శంకర్ కూడ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. శంకర్ దాదాపు 21 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రోబో2 మూవీని మూడు నిర్మాణ సంస్థల భాగస్వామ్యంలో తెరకెక్కించబోతున్నారు. ఇందులో రిలయల్స్, సన్ నెట్ వర్క్ లు కాగా వీటితో పాటు మరో ఇంటర్నేషనల్ కార్పోరేట్ సంస్థ కూడ రోబో2 మూవీ నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. చిత్ర నిర్మాణ వ్యయం 120 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. మొత్తానికి శంకర్ రెమ్యునరేషన్ తెలుసుకున్న కోలీవుడ్ కి చెందిన ఇతర దర్శకులు ఒక్కసారిగా ఆశ్ఛర్యపడుతున్నారు. ఎందుకంటే శంకర్ ఒక మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనేది ఇప్పటి వరకూ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మందికి ఇంకా తెలియదట. అందుకే మొదటి సారిగా తన రెమ్యునరేషన్ డిటైల్స్ బయటకు రావడంతో అందరూ అవాక్కవుతున్నారు. కార్పోరేట్ సంస్థలు రోబో సీక్వెల్ ని నిర్మాతలు కావడంతో కాస్ట్ అండ్ క్రూ కి సంబంధించిన అన్ని వివరాలు బయటకు వస్తున్నాయని కోలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: