నవరస నటనా సార్వభౌముడిగా వందలాది సినిమాలలో ఎన్నో పాత్రలు చేసిన కైకాల సత్యనారాయణ పేరు వినగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఆయన చేసిన యముడి పాత్రలు. ‘యమగోలా’, ‘యడుడికి మొగుడు’, ‘యమలీల’ వంటి సినిమాల ఘన విజయం వెనుక సత్యనారాయణ యముడి పాత్ర ఆ చిత్రాల విజయానికి ఎంత దోహదం చేసిందో వేరే చెప్పనవసరం లేదు.  ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రముఖ పత్రికతో నేటి టాలీవుడ్ పరిశ్రమ పై తన భావాలను షేర్ చేసుకున్నారు సత్యనారాయణ. నేటి టాలీవుడ్ పరిశ్రమ వారసత్వ జాడ్యంతో రోజురోజుకూ తన ప్రాభవాన్ని కోల్పోవడమే కాకుండా గాడ్ ఫాదర్స్ లేనివారికి అవకాశాలు రావడం లేదని ఒకవేళ ఏదోవిధంగా ప్రతిభతో అవకాశాలు వచ్చినా అటువంటి నటీనటుల పై దర్శక నిర్మాతలకే కాకుండా ప్రేక్షకులకు కూడ పెద్దక్రేజ్ లేకపోవడంతో వారికి ఎంత ప్రతిభ ఉన్నా రాణించడం లేదని అభిప్రాయ పడ్డారు సత్యనారాయణ.  ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలుగా నిలిచిన రామారావు, నాగేస్వరరావు లాంటి హీరోలు తమ పారితోషికాలను 1లక్ష నుండి 2లక్షలకు పెంచడానికి ఎన్నో సంవత్సరాలు పట్టడమే కాకుండా తమ పారితోషిక విషయంలో నిర్మాతలతో బేరసారాలు ఆడడానికి మొహమాటం పడే వారు అని అంటూ నేటి యంగ్ హీరోలు కోట్లాది రూపాయలను పారితోషికాలు ఎలా అడుగుతున్నారో తనకు అర్ధం కావడంలేదని నేటి టాప్ యంగ్ హీరోల పై సెటైర్లు వేసారు. తన దృష్టిలో తెలుగు సినిమా రంగానికి సంబంధించి 1950 నుంచి 1970 వరకు కొనసాగిన కాలమే స్వర్ణయుగం అని అంటూ భవిష్యత్తులో ఆస్థాయి సినిమాలు మన తెలుగులో వచ్చే అవకాసం తనకు లేదు అని అంటున్నారు ఈ నవరస నటనా సార్వభౌముడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: