పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల' సినిమా షూటింగ్ లో పవన్ షూటింగ్ లోకి వచ్చిన కనీసం రెండు రోజులు కూడ పూర్తి కాకుండానే ఈ సినిమా షూటింగ్ విషయాల పై ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన రూమర్ల పై దర్శకుడు కిషోర్ కుమార్ (డాలీ) ప్రతిస్పందించి నట్లుగా వార్తలు వస్తున్నాయి.  బయట మీడియాలో వార్తలు వస్తున్నట్లుగా ఈసినిమా స్ర్కిప్ట్‌ విషయంలో పవన్ కు ఎటువంటి అసంతృప్తిలేదని ఈసినిమా స్క్రిప్ట్ విషయంలో పవన్ కలగజేసుకుంటున్నాడని వస్తున్నరూమర్స్ లో నిజంలేదు అంటున్నాడు దర్శకుడు డాలీ.  ఆమాటకొస్తే అసలు పవన్ కు సినిమా స్క్రిప్ట్ విషయంలోకలగజేసుకునే మనస్తత్వంలేదని దర్శకుడు డాలీ అంటూ ఈసినిమా పై నడుస్తున్నరూమర్ల అంకానికి తెరదించడానికి ప్రయత్నించి నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ ఈసినిమా షూటింగ్ లో గత బుధవారం నుండి ఉత్సాహంగా పాల్గొoటున్నట్లుగా ఈఫిలిం యూనిట్ కు సంబంధించిన వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పవన్ సినిమా వచ్చి ఒక సంవత్సరం దాటిపోతు ఉండటంతో ఈ సినిమా గురించి పవన్ అభిమానులలోనే కాకుండా సాధారణ ప్రేక్షకులలో కూడ విపరీతమైన ఆశక్తి పెరిగిపోతోంది. పవన్ యాక్షన్ స్టైల్ కు భిన్నంగా ఉండే ఈ పాత్ర పోషించి అభిమానులను మెప్పించడం పవన్ కు పెద్ద పరీక్షే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: