మెగా బ్రదర్ నాగబాబువారసుడు వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమాకు ‘గొల్లభామ’ అనే టైటిల్ విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ మెగా వారసుడు కుడా తన కొత్త సినిమాకు టైటిల్ గా క్ర్రిష్ణ శబ్దం అర్ధం వచ్చేలా ‘ముకుందా’ అనే టైటిల్ కి ఓటు వేసినట్లుగా వార్తలు వస్తునాయి. వరుణ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చాలా వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ అని టాక్. అయితే ఈ సినిమాకు ‘గొల్లభామ’ టైటిల్ పూర్తి గా నప్పినా గొల్లభామ టైటిల్ ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినట్లుగా ఉందని విమర్శలు రావడంతో ఈ సినిమా యూనిట్ అంతా 'ముకుందా' వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  గ్రామీణ నేపథ్యంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో వరుణ్‌తేజ్‌ బాస్కెట్ బాల్ క్రీడాకారుడిగా కనిపిస్తాడని ఫిలిం నగర్ టాక్. దీపావళి తరువాత ఈ సినిమా విడుదల అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కోసం అటు బన్నీ ఇటు చెర్రీ కూడ రెండు ప్రత్యేక పాత్రలలో కనిపిస్తారనే రూమర్ ఉంది. ఏమైనా తనబాబాయి పవన్ లాగే అబ్బాయి వరుణ్ తేజ్ కూడ తన సినిమాకు కృష్ణుడినే నమ్ముకున్నాడు అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: