మొన్న విడుదల అయిన బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ సినిమాకు రొటీన్ సినిమా అని మార్కులు పడినా ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీనివాస్ కు డాన్స్ లు ఫైట్లు బాగా చేస్తాడు అనే పేరు వచ్చింది. దీనితో ఈ సినిమా టాక్ ఒక మోస్తరుగా ఉన్నా బి సి సెంటర్లలో ఇప్పటి వరకు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి.  అంతే కాకుండా బోయపాటి, శ్రీనువైట్ల లాంటి దర్శకుల సినిమాలలో కూడా త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు ఉంటాయి అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమామటుకు తమన్నాకు ఊహించని షాక్ ఇచ్చింది అని అంటున్నారు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరిసిన తమన్నా అందాల కోసం ఏదేదో ఊహించు కుంటూ ధియేటర్లలోకి వచ్చిన యూత్ కు తమన్నా అందాలు రొటీన్ లాగే కనిపించడంతో మిల్కీ బ్యూటీ ఈసినిమాను ఏమి షేక్ చేయలేకపోయింది అన్న నిరాశతో ధియేటర్ల నుండి యూత్ బయటకు వస్తోంది అని టాక్. ఐటమ్ గర్ల్ అంటే కనిపించేది ఐదే నిముషాలు అయినా ప్రేక్షకులను మైమరిపించాలని కానీ తమన్నా ఈ సినిమా కోసం చేసిన స్పెషల్ సాంగ్ లో ఆమె డాన్స్, ఎక్స్ ప్రేషన్స్ బాగానే ఉన్నా ఎందుకో కుర్ర కారుకు కిక్ ఇవ్వలేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తమన్నా అందాలు ఐటమ్ సాంగ్ కు పనికిరావు అనే మాటలు ఫిలింనగర్ లో అప్పుడే మొదలైపోయాయి.  దీనితో తమన్నా అందాల కోసం లక్షలు గుమ్మరించిన బెల్లంకొండ ప్లాన్ కలిసిరాలేదు అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: