ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గోవిందుడు అందరి వాడేలే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ చాలా లేటుగా జరుగుతున్నాయి. క్రిష్ణవంశీ టేకింగ్ కాబట్టి ఆ మాత్రం ఆలస్యం తప్పదు మరి అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ స్టోరి అనేది క్రిష్ణవంశీ రామ్ చరణ్ కి డైరెక్ట్ గా వినిపించలేదని అంటున్నారు. దీని కంటే ముందుగా వేరొక హీరోకి వినిపించిన తరువాత, అక్కడ నుండి రామ్ చరణ్ వద్దకి వచ్చిందని అంటున్నారు. మొదటగా క్రిష్ణవంశీ, మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమాకి కథ చెప్పటం కోసం వెళ్ళాడు. అప్పుడు చిరంజీవి మొదటగా రామ్ చరణ్ తో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీని తెరకెక్కించు, తరువాత చూద్దాం అన్నాడట. ఇంకే ముంది క్రిష్ణవంశీ అప్పటికే నాగార్జున ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం రెడీ చేసుకున్న త్రయం కథని చిరంజీవికి వినిపించాడు. అప్పటికే నాగార్జున ఆ కథని నచ్చి, కథలో మార్పులు చేయాల్సిదిగా కోరితే అందుకు క్రిష్ణవంశీ ఒప్పుకోలేదు. ఈ గ్యాప్ లో చిరంజీవి,రామ్ చరణ్ ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కథలో కొన్ని మార్పులుచేసి గోవిందుడు అందరివాడేలే అంటూ క్రిష్ణవంశీ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మొత్తంగా నాగార్జున తిరస్కరించిన స్టోరిని చిరంజీవి, రామ్ చరణ్ సెలక్ట్ చేసుకోవడం అనేది ఎటువంటి రిజల్ట్ ని ఇస్తుందో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ వెయిట్ చేయ్యాల్సిందే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: