వరస పెట్టి వస్తున్న పరాజయాలకు గత సంవత్సరం తన ‘బలుపు’ ద్వారా బ్రేక్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘పవర్’ ను జెమినీ టీవి యాజమాన్యం ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఏడున్నర కోట్లకు కొనుగోలు చేసింది అనే వార్తలు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ‘బలుపు’ తరువాత ఒక్క సినిమా కూడ రవితేజ నటించినది విడుదల కాకపోయినా రవితేజ ‘పవర్’ కు ఇంత రేటు పలకడం రవితేజ క్రేజ్ ఏ స్థాయిలో ఉందొ మరోసారి రుజువు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. జెమినీ టీవి ఇంత భారీ మొత్తానికి ఈ సినిమాను కొనడంలో గల కారణం రవితేజ సినిమాలు బుల్లి తెర పై టీఆర్పి రేటింగులు బాగుంటాయని అందు చేతనే జెమినీ టివి టాప్ యంగ్ హీరోల సినిమాలతో సమానంగా ఇంత రేట్ ‘బలుపు’ పై పెట్టింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ సినిమా ఆడియోను ఆగష్టు నెలాఖరుకు విడుదల చేసి అక్టోబర్ లో ఈ సినిమాను విడుదలచేసే ఉద్దేశ్యంలో ఈ సినిమా దర్శక నిర్మాతలు ఉన్నారని ఫిలింనగర్ టాక్. రవితేజా హన్సికల మధ్య రొమాంటిక్ సీన్స్, రవితేజా మాస్ పంచ్ డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని ఫిలింనగర్ టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: