తెలంగాణా ప్రభుత్వo సానియా మిర్జా ను తెలంగాణా రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించిన తరువాత ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడ ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్ పదవిని సృస్టించబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. అంతేకాదు బాబు మనసులో బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ ఉన్నాడు అంటూ వెబ్ మీడియాలో వచ్చిన వార్తలు మహేష్, పవన్ అభిమానుల మధ్య పెనుదుమారాన్నే సృష్టిస్తున్నాయి.  ఈవార్తలు తెలుసుకున్న పవన్ అభిమానులు ఇంకా ఎటువంటి ప్రకటన రాకపోయినా తెలుగుదేశం అధినాయకత్వం పై తీవ్ర అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికలలో మండే ఎండలను కూడ లెక్క చేయకుండా రాష్ట్రం అంతా ప్రకటించి తెలుగుదేశ విజయానికి కృషి చేసిన పవన్ కళ్యాణ్ కు ఆయన పేరు చెప్పి ఓట్లు వేయించుకున్న తెలుగుదేశ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ వెబ్ మీడియా సాక్షిగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  అదేవిధంగా మహేష్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినా ఒరిగే ప్రయోజనం ఏమి లేదు అంటూ కామెంట్లు విసురుతున్నారు. అప్పుడప్పుడు జరిగే ప్రభుత్వ అధికారిక కార్యకలాపాలలో మెరవడం తప్ప మహేష్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని అదే బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ ను నియమిస్తే ప్రజలలో సామాజిక చైతన్యం కోసం, మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న పవన్ కృషిని ప్రభుత్వం గుర్తించినట్లుగా మంచి సంకేతాలు ప్రజలలోకి వెళ్లి తెలుగుదేశ ప్రభుత్వానికి మంచి ఇమేజ్ వస్తుందని పవన్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఏమైనా ఇంకా ఎటువంటి ప్రకటనా లేని వార్త పవన్, మహేష్ అభిమానుల మధ్య పెనుదుమారాన్నే రేపుతోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: