నేటితరం అమ్మాయిలంతా సిక్స్‌ప్యాక్ వున్నవాళ్లంటే ఇష్టపడతారని అందరూ అనుకుంటారు. అయితే పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ కౌర్‌ కి మాత్రం సిక్స్ ప్యాక్ తో ఉండే అబ్బాయిలు నచ్చరని చెపుతోంది. తాను అభిమానించే వ్యక్తికి మాత్రం సిక్స్‌ ప్యాక్ అవసరం లేదు ,ఫిట్‌నెస్ పర్‌ఫెక్ట్‌గా వుండి చూడ చక్కగా వుంటే చాలు అంటూ తన మనసులోని మాట బయట పెట్టింది.  భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో ఓ ఫిట్‌నెస్ స్టూడియోలో ఫిట్‌నెస్ అవేర్‌నెస్ ప్రోగ్రాంని ప్రారంభించ డానికి వచ్చిన ఛార్మి ఈకామెంట్స్ చేసింది. అంతేకాదు 18 ఏళ్ల నుండి 30 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు ఫిట్ నెస్ పాటిస్తే, మంచి ఆహారపు అలవాట్లు అలవడుతాయని చెపుతున్న ఛార్మీకి ఎందుకు సిక్స్ ప్యాక్ కలిగిన అబ్బాయిలంటే ఇష్టం లేదో క్లారిటీ ఇవ్వలేదు.  బహుశా ఛార్మీ విపరీతంగా అభిమానించే సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ కు సిక్స్ ప్యాక్ లేకపోవడం కారణం అనుకోవాలి. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకున్నా తాను నటిస్తున్న ‘మంత్ర-2’ విజయం పై బోలెడు ఆశలు పెట్టుకున్న ఛార్మీ మధ్యమధ్యన ఇటువంటి కామెంట్స్ చేస్తూ ప్రజలు తనను మర్చి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటోoది.  మరి ఛార్మీ అభిప్రాయాన్ని ఎంతమంది అమ్మాయిలు అంగీకరిస్తారో చూడాలి. మంచి నటిగా పేరున్నా అదృష్టం కలిసి రాక నేటి హీరోయిన్స్ రేసులో ఛార్మీ వెనుక పడిపోతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: