‘నాయక్’, ‘బాదుషా’ సినిమాలలో గ్లామర్ డాల్ గా కనిపించి యూత్ మైండ్ ను షేక్ చేసిన కాజల్ టాలీవుడ్ పై తనకున్న కోపాన్ని తొలగించుకుని మళ్ళీ చరణ్ కు అదృష్ట దేవతగా మారడానికి ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ కు సంబంధించి ఫోటోలు బయటకు వచ్చినా కాజల్ లుక్ కు సంబంధించి మాత్రం ఏ ఫోటోలు ఇప్పటి వరకు అధికారకంగా బయటకు రాలేదు. అయితే కాజల్ ఈసినిమాలోని తన లుక్ కు సంబంధించిన ఫోటోను లీక్ చేసి సంచలనం చేసింది. పల్లెటూరి వాతావరణంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ పదహారణాల తెలుగు అమ్మాయిగా బ్లాక్ అండ్ వైట్ ఆఫ్ శారీతో నడుముకు ఒడ్డాణం పెట్టుకుని వెరైటీ లుక్ తో కనిపిస్తూ యూత్ ను ఆకర్షిస్తోంది. మిడ్డీలకు, బికినీలకు అలవాటు పడిన నేటి యూత్ కు పల్లెటూరి అమ్మాయిల గ్లామర్ ను రుచి చూపిస్తూ మళ్ళీ నేటి తరాన్ని వెనుకకు తీసుకు వెళుతోంది. కుటుంబ సంబందాల అనుబందం పల్లెటూరి వాతావరణ నేపధ్యంలో కృష్ణవంశీ తీస్తున్న ‘గోవిందుడు’ సక్సస్ అయితే ఇక టాప్ హీరోయిన్స్ అంతా మరిచిపోయిన ఆఫ్ శారీ కల్చర్ ను మళ్ళీ వెండితెర పైకి తీసుకు వచ్చిన క్రెడిట్ కాజల్ కు దక్కుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: