గత శుక్రువారం విడుదల అయిన బెల్లంకొండ శ్రీనివాస్ తొలి ప్రయత్నం ‘అల్లుడి శీను’ మొదటిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2.82 కోట్లు వసూలు చేసి అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా ‘చిరుత’ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ తరువాత (రెండవ) స్థానంలో నిలవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. చరణ్ తరువాత ఎంతోమంది హీరోల మొదటి సినిమాలు వచ్చినా ‘అల్లుడు శీను’ మొదటిరోజు కలెక్షన్స్ ఆ హీరోల మొదటిరోజు కలెక్షన్స్ స్థాయిని దాటిపోవడం ప్రస్తుతం టాలీవుడ్ కు సంచలనమైంది. మరొక విషయం ఏమిటంటే ఈ సినిమా మొదటి రెండు రోజులు 4.87 కోట్లు వసూలు చేయడం అందర్నీ షేక్ చేస్తోంది.  ఒక కొత్త హీరో సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం రికార్డు అని అంటున్నారు. ఈసినిమాకు టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ కురిపిస్తూ ఉండటంతో బెల్లంకొండ శీను మీడియాకు సెలెబ్రెటీగా మారిపోవడమే కాకుండా ఇంటర్వ్యూలు కూడ ఇచ్చేస్తున్నాడు. వియత్నాం, అమెరికా, ముంబాయిలలో దాదాపు ఐదేళ్ళ పాటు ఫైట్స్, డాన్స్ లలో శిక్షణ తీసుకున్నాను అని చెపుతున్న బెల్లంకొండ వారి అబ్బాయి కృషి ఫలించిందనే అనుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్న పోటీ వాతావరణంలో ఈహీరో ఏ స్థాయిలో నిలబడతాడు అన్న విషయం ఈ వారం ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ పై ఆధారపడి ఉంటుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: