సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ కేథరిన్ థెరిస్సా త్వరలోనే సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతుంది. తను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చినప్పటి నుండి ఆశించినంతగా అవకాశాలు రావడం లేదు. అందరి హీరోయిన్స్ కంటే ఎక్స్ పోజింగ్ విషయంలో ఒక అడుగు ముందుగానే ఉండే కేథరిన్ కు మాత్రం అవకాశాలు ఎందుకు రావడం లేదు అనేది చిత్రా వర్గాలలో కొందరికి ఇప్పటికీ ఆశ్ఛర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం కేథరిన్ థెరిస్సా రుద్రమదేవి మూవీలో ఓ ముఖ్యపాత్ర చేస్తున్నప్పటికీ, ఈ మూవీ తరువాత కేవలం ఒకే ఒక్క మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతకు మించి కేథరిన్ కి వరుస ఆఫర్లు ఏమి రావడం లేదు. అందుకే తను ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగాలా? వద్దా? వంటి నిర్ణయాన్ని త్వరలోనే తీసుకోబోతుందంటూ టాలీవుడ్ లో హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తన ముందు ఉన్న మూవీలను త్వరగా ఫినిష్ చేసి, తరువాత తన వద్దకు వస్తున్న ప్రొడ్యూజర్స్ కి, అలాగే డైరెక్టర్స్ కి తను ఎటువంటి నిర్ణయాన్ని చెప్పకుండా కొంత కాలం వెయిటింగ్ లో పెడుతుందట. అంతే కాకుండా తను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ యంగ్ హీరోతో నడిపిన డేటింగ్ వ్యవహారం కారణంగానే తనని ఇండస్ట్రీలో తక్కువుగా చేసి చూస్తున్నారని కొందరు అంటున్నారు. ఏదేమైనా కేథరిన్ లాంటి హ్యాట్ బ్యూటికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదు అనేది కొత్తగానే ఉంది. అందరిలాగే కేథరిన్ కూడ గ్లామర్ పాత్రలను చక్కగా చేస్తుంది. ఇద్దరమ్మాయిలతో మూవీలో నటించిన తరువాత కేథరిన్ కి వరుస ఆఫర్స్ వస్తున్నాయని ఆశిస్తే, కాని ఆఫర్స్ మాత్రం ఏ మాత్రం వరించలేదు.అంతే కాకుండా కేథరిన్ కి బోల్డ్ స్టోరీలు చెప్పే డైరెక్టర్స్ ఎక్కువయ్యారని తనే కొన్ని సందర్భాల్లో తన సన్నిహితులతో చెప్పుకొచ్చింది. ఏదేమైనా కేథరిన్ థెరిస్సా ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమైతే తరువాత ఏం చేస్తుందనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: