టాలీవుడ్ సినిమా రంగంలో గత ఐదేళ్ళుగా తమన్ వరుస పెట్టి సంగీత దర్శకుడిగా విజయాలు సాధిస్తూ దేవీశ్రీప్రసాద్ కు గట్టి పోటి ఇస్తున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహానటుడుని టాలీవుడ్ కు పరిచయం చేసిన ఘంటసాల బలరామయ్య మనవడుగా తమన్ కు సినిమా వారసత్వం ఉన్నా తన స్వయం కృషితో సంగీత దర్శకుడిగా ఎదగడమే కాకుండా అప్పుడే తమన్ తన 50వ సినిమాకు అతి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం సంగీత దర్శకుల మధ్య విపరీతమైన పోటీ ఉన్నా తన ప్రతిభతో రాణిస్తూ మిగతా అందరి సంగీత దర్శకులతో మంచి సంబంధాలను కొనసాగించడం తమన్ ప్రత్యేకత. ఇది ఇలా ఉండగా తమన్ రవితేజ నటిస్తున్న ‘పవర్’ సినిమా కోసం పాటలను రికార్డింగ్ చేస్తున్న సమయంలో ఒక మాస్ మసాలా పాటకు ఒక డిఫరంట్ వాయిస్ ఉంటే బాగుంటుందని భావించిన తమన్ ఈ పాటను చక్రీ చేత పాడిస్తే బాగుంటుంది అన్న ఆలోచన రావడంతో తమన్ కోరిన వెంటనే చక్రీ వచ్చి ఆ పాటను పాడటమే కాకుండా ఆ పాట ట్యూన్ కు సంబంధించి చిన్నచిన్న మార్పులు కూడ చేసాడట.  దీనితో ఆనందం పట్టలేక తమన్ ఈ విషయాన్ని తన ట్విటర్ లో పెట్టడమే కాకుండా ఈ సందర్భంలో వారిద్దరూ తీయించుకున్న ఫోటోను తన ట్విట్టర్ లో పెట్టి హడావిడి చేస్తూ సందడి చేస్తున్నాడు . ఏమైనా చక్రి మరో మంచి సాంప్రదయానికి తెర తీసాడు అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: