కోలీవుడ్ టాప్ హీరో సూర్య రాజమౌళి ‘బాహుబలి’ లో నటిస్తున్నాడు అంటూ వస్తున్న రూమర్లు అందరినీ ఆశ్చర్య పరచడమే కాకుండా టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. అయితే అసలు ఈ వార్తలు ఎలా వచ్చాయి అన్న విషయంలోకి వెళితే హీరో సూర్య ఈమధ్య ‘బాహుబలి’ షూటింగ్ జరతుగుతున్న షూటింగ్ స్పాట్ లో కనపడటం అని అంటున్నారు.  ఈమధ్య రామోజీ ఫిలిం సిటీలో తన సినిమా ‘సికిందర్’ షూటింగ్ కోసం సందడి చేసిన సూర్య అక్కడే షూటింగ్ జరుగుతున్న రాజమౌళి ‘బాహుబలి’ సెట్ లోకి వెళ్లడమే కాకుండా కొంత సేపు రాజమౌళితో ఏకాంతంగా సంభాషించడంతో ‘బాహుబలి’ సినిమాలో హీరో సూర్య నటించబోతున్నాడు అంటూ వార్తలు రావడమే కాకుండా ఈ సినిమాలో సూర్య జయదేవ రాణా అనే పాత్రలో కనిపిస్తాడు అనే ప్రచారం కూడ తీవ్ర స్థాయిలో జరిగింది. అంతేకాదు ఈ భారీ సినిమాలో సూర్య నటించడం వల్ల కోలీవుడ్ లో ఈ సినిమాకు ఇంకా మార్కెట్ పెరుగుతుంది అనే అంచనాలు కూడ రూమర్లుగా బయటకు వచ్చాయి. అయితే వినిపిస్తున్న ఈ రూమర్లను రాజమౌళి ఇంకా అధికారికంగా ఖండించక పోవడంతో మన జక్కన్న ఈ గాలి వార్తలను ఎంజాయ్ చేస్తున్నాడా లేదంటే రాజమౌళి ఆలోచనలు కూడఈ విధంగానే ఉన్నాయా? అనే ఊహలతో ‘బాహుబలి’ సినిమాకు ప్రస్తుతం సూర్య ఒక హాట్ టాపిక్ గా మారాడు అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: