రాబోతున్న స్వతంత్ర దినోత్సవం ఆగష్టు 15ను పవన్ తన సుదీర్ఘ మౌనం వీడే ముహూర్తంగా ఎంచుకున్నాడు అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నాటికి జనసేన పార్టీని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ఉన్న పవన్ ఆదశగా అడుగులువేస్తూ ఆగస్టు 15వ తేదీన ప్రెస్‌మీట్‌లో అన్ని విషయాల పై ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు అనే వార్తలు ఫిలింనగర్ లో గట్టిగా హల్చల్ చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ సూచనలు, సలహాలమేరకు, ఫ్రముఖ ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి పార్టీ సింబల్ 'పిడికిలి'ని ఆకర్షణీయంగా డిజైన్ చేస్తున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ‘జనసేన’ కు సంభందించి రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో తాత్కాలిక కమిటీలు ఏర్పాటుకు సంబంధించి తన సన్నిహితులతో చర్చిస్తున్నాడని టాక్ . అంతే కాకుండా ‘జనసేన పార్టీని కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగా రాష్ట్రాలకే పరిమితం కాకుండా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ఇరుగు పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో జనసేన పార్టీని విస్తరించాలి అనే యోచనలో పవన్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా పవన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గబ్బర్ సింగ్ 2’ చేయకూడదని పవన్‌ ఫిక్స్‌ అయ్యాడు అంటూ వార్తలు ఊపు అందుకున్నాయి. ఈ సినిమా బదులు మరో సినిమాను చేస్తానని ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ కు పవన్ చెపుతున్నాడు అని టాక్. ఈవార్తలే నిజం అయితే సంపత్‌ నంది పరిస్థితి ఏమిటి అనేది సమాధానం లేని ప్రశ్న అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: