ప్రస్తుతం మళ్ళీ టాలీవుడ్ లో తన హవాను చాటడానికి సినిమాలు చేస్తూ తన ప్రయత్నాలు చేస్తున్న కాజల్ అనుకోకుండా బాలీవుడ్ లో ఒక మంచి సినిమాను కొట్టేసింది. దర్శకుడు సుధీర్ మిశ్రా తాను తెరకెక్కించనున్న 'అవుర్ దేవదాస్' చిత్రంలో కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశాడు. మొదట ఈ పాత్ర కోసం చిత్రాం గదసింగ్ ను తీసుకున్నా తరువాత ఆమెను తప్పించి కాజల్ కు అవకాశమిచ్చారు. కాజల్ అయితేనే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావించిన నిర్మాతలు ఆమెకు ఈ అవకాశం ఇచ్చినట్లుగా బాలీవుడ్ టాక్. రొమాంటిక్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు షినీ అహుజా, కాజల్ తో కలిసి నటించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ అహుజా తో కలిసి నటించడం ఇష్ట పడటం లేదు. దీనికి కారణం ఈ బాలీవుడ్ నటుడు తన దగ్గర పనిచేసే ఒక అమ్మాయిని రేప్ చేసాడు అని అభియోగాలు రావడమే కాకుండా కోర్ట్ లో ఈ బాలీవుడ్ నటుడికి శిక్ష కుడా పడింది. దీనితో చాలా మంది అహుజ పెరుచేపితే భయపడి పోవడమే కాకుండా అతడు నటిస్తున్న సినిమాలు అంటే దూరం జరుగుతున్నారు. ఈ పరిస్థితులలో కాజల్ ఆహుజాతో కలసి ‘అవుర్ దేవదాస్’ చేయడం బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: