మహేష్ పురిజగాన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ మహేష్ ను సూపర్ స్టార్ గా మార్చిన విషయo తెలిసిందే. ఈ సినిమా లో మహేష్ కోసం పూరి రాసిన పంచ్ డైలాగులు మహేష్ అభిమానులకే కాదు సామాన్య ప్రేక్షకులు కుడా ఇప్పటికీ మరిచిపోలేని సినిమాగా మార్చేసాయి. ఈసినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ అటువంటి సినిమా ఎప్పుడు వస్తుందా అని మహేష్ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.  ఈ పరిస్థుతుల నేపధ్యంలో పూరి జగన్నాథ్ చెప్పిన స్టోరీ లైన్ విపరీతంగా నచ్చడంతో మహేష్ అశ్వనీదత్ నిర్మాణంలో నిర్మించే ఈ సినిమాకు వచ్చే నవంబర్ నుండి పూరీకి డేట్స్ ఇచ్చాడు అనే వార్త ఒక వైపు మహేష్ అభిమానులను ఆనంద పెడుతున్నా మరోవైపు మహేష్ అభిమానులను భయపెడుతోంది అని అంటున్నారు.  దీనికి కారణం ఇప్పటికే బండ్ల గణేష్ పూరీ దర్శకత్వంలో జూనియర్ హీరోగా తీస్తున్న సినిమా అని అంటున్నారు. వచ్చేనెల షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుని రాబోతున్న సంక్రాంతి రేసుకు సిద్ధం కాబోతోంది. వక్కంతం వంశీ సమకూర్చిన కధకు పూరి తన స్టైల్ లో జూనియర్ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ బిజీలో ఉండగానే నవంబర్ నుండి ప్రారంభం కాబోతున్న మహేష్ సినిమా స్క్రిప్ట్ పై సరైన దృష్టి పెట్టకపోతే మహేష్ కు మరో చేదు అనుభవంలా మారిపోతుంది కాబట్టి ఈ హడావిడిల మధ్య పూరి మహేష్ సినిమా స్క్రిప్ట్ కు సరైన న్యాయం చేస్తాడా? అన్న టెన్షన్ లో మహేష్ అభిమానులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏ సినిమా స్క్రిప్ట్ ను అయినా వారం రోజులలో చుట్టేసే పూరి సమర్ధత గురించి మహేష్ అభిమానులకు తెలియదు అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: